తాండూర్ లో కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు
తాండూర్, పెన్ పవర్
కరోనా సెకండ్ వేవ్ అత్యంత ప్రమాద కరంగా పెరుగుతున్న నేపద్యంలో తాండూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పోలీస్ స్టేషన్లో, పోస్ట్ ఆఫీస్ మరియు కొత్త గుడిసెలు కాలనీ లో పాటు తాండూర్ లోని అన్ని వీధులలో కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే చెయడం జరిగినది. కోవిడ్ - 19 వ్యాప్తి చెందడం అనేది మన అజాగ్రత్త వల్లనే జరుగుతుందని, అది మనతో పాటు మన కుటుంబాన్ని కూడా ఈచిదిమేస్తుందని, అందుచేత ప్రతి ఒక్కరూ అనవసరంగా బయటికి రావడం చేయొద్దని, అత్యవసర పరిస్థితిలో ముఖానికి మాస్క్ వేసుకుని రావాలని ఈ సందర్భంగా డి ఎల్ పి వో తెలియజేసారు.వారితో పాటు ఇంచార్జి సర్పంచ్ పూదరి నవీన్ కుమార్, ఉప సర్పంచ్ స్వరూప, ఈ వో తపాస్ గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు..
No comments:
Post a Comment