ఇద్దరికి కరోనా పాజిటివ్
మండల వైద్యాదికారి డాక్టర్ మానస వెల్లడి
పెన్ పవర్, ఎల్లారెడ్డిపేటఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 87 మందికి కరోనా నిర్ధారణ కోసం పరీక్షలు చేయగా ఇద్దరి కి కరోనా పాజిటివ్ రాగా 85 మందికి నెగిటివ్ వచ్చినట్టు మండల వైద్యాదికారి డాక్టర్ మానస తెలిపారు. రాజన్నపేట గ్రామనికి ఇద్దరికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు నిర్దారణ అయ్యిందన్నారు. కరోనా నిర్దారణ అయిన వ్యక్తులు కంట్రోల్ అయ్యేంతవరకు కుటుంబ సభ్యులకు దూరంగా మాస్కులు దరించి ఉండాలని . ప్రతి రోజు గోరువెచ్చని నీటినే తాగాలనీ ఆయన పిలుపునిచ్చారు. కరోనా సోకినట్టు అనుమానం ఉన్న వ్యక్తులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోనీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లో సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ధర్మానాయక్ కోరారు. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లో కోవీడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 45 సంవత్సరాల వయస్సు పై బడిన ప్రతి ఒక్కరికీ ( దీర్ఘకాలిక వ్యాదులతో సంబంధంలేకుండా ) వాక్సిన్ ఇవ్వబడుతుందన్నారు. లబ్దిదారులు అందరు కూడా ఆధార్ కార్డ్ తో రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా సద్వినియోగ పర్చుకోవాలనీ డాక్టర్ మానస తెలిపారు.
No comments:
Post a Comment