సామాజిక దూరమే ప్రాణాలు నిలిపేది
పెన్ పవర్, వలేటివారిపాలెం
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో సామాజిక దూరమే ప్రజల ప్రాణాలను కాపాడుతుందని, ఈ విషయం లో నిర్లక్ష్యం వహిస్తే కుటుంబాలు అధోగతి పాలు అవుతాయని సర్పంచ్ లు డేగా వెంకటేశ్వర్లు (బుజ్జి), దుగ్గిరాల రాఘవులు అన్నారు.
సోమవారం అయ్యవారిపల్లి, కలవల్ల,ఠ్య గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచే పనులు నిర్వహించారు. కందంకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపుమేరకు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రామాల్లో బ్లీచింగ్, హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లించామని తెలిపారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఎంత భీభత్సం సృష్టిస్తుందో అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పించారు.
No comments:
Post a Comment