చింతలవలస లో క్లీన్ అండ్ గ్రీన్
మెంటాడ మండలం, చింతలవలస గ్రామంలో సర్పంచ్ కలిశెట్టి సూర్యనారాయణ ఆధ్వర్యంలో గురువారము గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపట్టారు. మొత్తం గ్రామంలో అన్ని వీధిలోనూ బ్లీచింగ్ పౌడర్ తో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టారు.
కరోనా నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి వరం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బ్లీచింగ్ పౌడర్ చల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామస్తులకు కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కరోనా నివారణ మన చేతిలో ఉందని అందుకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రము నిర్లక్ష్యం చేసిన కరోనా మహమ్మారి మనపై దాడి చేస్తుందని తెలిపారు. విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment