ఉత్తమ వాలంటీర్లకు కోవిడ్ నిబంధనలతో సేవా పురస్కారాలు
పెన్ పవర్, ఆలమూరు
ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారదులైన వాలంటీర్ వ్యవస్థకు అరుదైన గౌరవం దక్కిందని ఆలమూరు ఎంపీడీవో జేఏ ఝాన్సీ అన్నారు. ప్రజా క్షేత్రంలో సంక్షేమాలఉత్తమ సేవలు అందించిన వాలంటీర్ లకు ప్రభుత్వం సేవ పురస్కారాలు అందజేసి వారి సేవలను గుర్తించడంతో కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో విశేష ప్రజా సేవలు అందించిన వాలంటీరులకు సేవావజ్ర, సేవసరత్నాలతో పాటు నజరానా ప్రకటించి మరింత సేవ చేయడం కోసం ప్రోత్సాహకాలను అందించేందుకు ఈ నెల 19వ తేదీ సోమవారం ఆలమూరు మండలం పధ్ధెనిమిది గ్రామాలకు సంబంధించి రావులపాలెంలో గల సీఆర్సీలో ఎనిమిది (3+5) మంది వాలంటీర్లకు కొత్తపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి గారి చేతుల మీదుగా సేవా పురస్కారాలు అందించనునారని ఎంపీడీవో తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ ప్రదానోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించాలని అనుకున్నా ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ మానవాళిపై భయంకరంగా విజృంభిస్తున్న తరుణంలో 18 గ్రామాలకు సంబంధించిన సర్పంచులు ముఖ్య నాయకులు మాత్రమే హాజరు కావాలని ఆమె తెలిపారు.
No comments:
Post a Comment