Followers

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

 అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి.. కార్పోరేటర్ శిరీష..

పెన్ పవర్, కాప్రా

 అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి కోరారు. సోమవారం డివిజన్ పరిధిలోని కమలానగర్ లో జరుగుతున్న డ్రైనేజీ పనులను ఏ ఎస్ రావు నగర్ పార్క్ లో జరుగుతున్న థీమ్ పార్క్ అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా శిరీష సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కమలానగర్ లో కేబుల్ పనుల కారణంగా దెబ్బ తిన్న కారణంగా చేపడుతున్న డ్రైనేజీ పనులను ఆమె పరిశీలించారు. ఎమర్జెన్సీ కింద చేపడుతున్న ఈ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం ఏఎస్ రావు నగర్ పార్క్ లో కోటి 50 లక్షల రూపాయలతో చేపడుతున్న థీమ్ పార్కు అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ రావు నగర్ సంతోష్ రెడ్డి, వర్క్ ఇన్స్ పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...