ప్రభుత్వం మహిళా పక్షపాతి
మహిళల ఆర్థిక స్వావలంబన ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ప్రభుత్వం మహిళా పక్షపాతిగా నిరూపించుకుందని స్థానిక శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి సున్నా వడ్డీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఎమ్మెల్యే మీద మహీధర్ రెడ్డి చేతుల మీదగా ఒక కోటి నలభై మూడు లక్షలాఎనభై ఏడు వేల అయిదు వందలా అరవై రెండు రూపాయల నలభై అయిదు పైసలు చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా మహీధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు లో భాగంగా సున్నా వడ్డీ రెండవ విడతలో భాగంగా నేడు ఆ సొమ్మును ద్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేశారని అన్నారు.ఎల్లప్పుడూ మహిళా అభ్యున్నతిని కోరుకునే ముఖ్యమంత్రి మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, మెప్మా శ్రీలత, డ్వాక్రా మహిళా సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment