Followers

చిలుకనగర్ డివిజన్ లోని నాలా ఆక్రమణలపై సర్వే

 చిలుకనగర్ డివిజన్ లోని నాలా ఆక్రమణలపై సర్వే 

తార్నాక, పెన్ పవర్

చిలుకనగర్ డివిజన్  హైకోర్టు కాలనీ నుండి కావేరి నగర్ కల్వర్టు వరకు  నాలా ఆక్రమణలపై సర్వే చేయాలని కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్  గతం లో విజ్ఞప్తి చేసిన మేరకు శనివారం వివిధ విభాగాల అధికారులు నాలా  అక్రమ కట్టడాలను గుర్తించారు.  నాలా  ఎక్కడెక్కడ నాల కుదించబడింది వాటిని పరిశీలించారు . నాలా ఆక్రమణలకు గురికాకుండా త్వరలో నాలా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ విభాగం సర్వేయర్ ప్రశాంత్  , జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ ఏసీపీ  శ్రావణి , జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఈఈ నాగేందర్ , ఏఈ రాజ్ కుమార్,  మరియు డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...