Followers

కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పాటించాలి

 కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పాటించాలి; జిల్లా కలెక్టర్ షేక్

వనపర్తి, పెన్ పవర్

వనపర్తి జిల్లాలో ప్రారంభమయ్యే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలు పాటించి ధాన్యం కొనుగోలు చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిల ను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు నాణ్యతా ప్రమాణాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేయబోయే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రతి రైతు వరి ధాన్యము తీసుకు  వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులు తమ వరి ధాన్యాన్ని ఎలాంటి చెత్త లేకుండా, తేమశాతం 17 ఉండేలా చూడాలని అన్నారు. ప్రతి రైతుకు వరి ధాన్యం నాణ్యతా ప్రమాణాల పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సంబంధించిన కొనుగోళ్లపై ఓ పి ఎం ఎస్ లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డి ఎం సి ఎస్ అనిల్ కుమార్, డి సి ఎస్ఓ, జిల్లా మార్కెట్ అధికారి, డిఆర్డిఓ  పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...