ప్రజా సమస్యల పరిష్కరమే లక్ష్యం....
పెన్ పవర్, విజయనగరంప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని నగరపాలక మేయర్ శ్రీమతి వెంప డా పు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి ముచ్చు నాగలక్ష్మి, 29వ వార్డు కార్పొరేటర్ కోలగట్ల శ్రావణి అన్నారు. శుక్రవారం నాడు నెల్లిమర్ల చంపావతి రిజర్వాయర్ వద్ద ఆండ్ర జలాశయం నుంచి నెల్లిమర్ల రిజర్వాయర్కు 50 క్యూసెక్కుల నీరు చేరుకున్న సందర్భంలో గంగమ్మ తల్లికి వీరు జలహారతి నిర్వహించారు. నగరపాలక సంస్థ మహిళా కార్పొరేటర్లు అందరు కూడా నెల్లిమర్ల రిజర్వాయర్ ను సందర్శించి చంపావతి నది లో గంగమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు నిర్వహించి, జల హారతి కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నీటి సమస్యలు తీర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో అయిదు రోజులకు ఒకసారి మంచినీరు సరఫరా జరిగితే, శాసనసభ్యునిగా కోలగట్ల వీరభద్రస్వామి పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికారులను సమన్వయ పరిచి రోజు విడిచి రోజు మంచినీరు సరఫరా అయ్యే విధంగా చూశారన్నారు. నమ్మిన ప్రజలకు అండగా ఉండాలని, నీటి సమస్య తీర్చడమే లక్ష్యంగా నగరంలో ఏడు ప్రాంతాలలో వాటర్ హెడ్ ట్యాంకులు నిర్మించడం జరిగిందన్నారు. చంపావతి నది లో నీటిమట్టాలు తగ్గుముఖం పట్టడంతో , రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ , నగరపాలక అధికారులు చొరవతో ఆండ్ర జలాశయం నుంచి నెల్లిమర్ల చంపావతి రిజర్వాయర్కు వాటర్ చేరుకుందన్నారు.నగర ప్రజలు తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు ఆండ్ర జలాశయం నుంచి చంపావతి నది లోకి నీరు తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారు, జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ కృషితో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఆండ్ర జలాశయం నుంచి నెల్లిమర్ల రిజర్వాయర్కు నీరు తరలించడం జరిగింది అన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ఆండ్ర నుంచి మంచినీరు విడుదల అవుతుందన్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడమే తమ లక్ష్యం అన్నారు.
ఆండ్ర జలాశయం నుంచి పిట్టా డ, మర్రివలస, మెంటాడ, కొని సి, గజపతినగరం, గరికవలస, తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్ట్, కోట గండ్రేడు, గుర్ల, మూల స్టేషన్ మీదుగా నెల్లిమర్ల రిజర్వాయర్కు మంచినీరు చేరుతుందన్నారు. సుమారు 44 కిలోమీటర్ల మేర ప్రవహించి చంపావతి నది లోకి నీరు వచ్చి చేరుతోంది అన్నారు. పట్టణ ప్రజలకు తాగునీటికి అవసరమైన నీటిని విడుదల చేసి, వేసవిలో లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు. అదేవిధంగా నీటి వృధాను అరికట్టేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి, పైపులైను మరమ్మతులను వెనువెంటనే చేయించడం అభినందనీయమన్నారు. అయితే ఇందుకు ప్రజల సహకారం కూడా ఎంతైనా అవసరం అన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుతూ, వృధాగా పోకుండా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో నగరపాలక ఇంజనీర్ డాక్టర్ దిలీప్, డి ఈ అప్పారావు, ఏ ఈ శ్రీనివాసరావుతో పాటు మహిళా కార్పొరేటర్లు బి. ధనలక్ష్మి, పొం త పల్లి మాలతి, ద్వాదశి సుమతి, నాయన పద్మ, ఇ సరపు రేవతీదేవి, రే గాన రూపా దేవి, ఏ సత్య కుమారి, య వర్ణ విజయలక్ష్మి, దుప్పాడ సునీత, భోగాపుర పు లక్ష్మి, బాలి పైడిరాజు, బాలి పద్మావతి, పిన్నింటి కళావతి, టీ .సంధ్యారాణి, తాళ్లపూడి సంతోషి కుమారి, పట్టా ఆదిలక్ష్మి, దాసరి సత్యవతి, సైలాడ ఈశ్వరమ్మ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment