Followers

చాగొల్లు లో కరోనా పై అవగాహన ర్యాలీ సర్పంచ్ లతా చంద్రశేఖర్....

 చాగొల్లు లో కరోనా పై అవగాహన ర్యాలీ సర్పంచ్ లతా చంద్రశేఖర్....

పెన్ పవర్, ఉలవపాడు

 మండలంలోని చాగొల్లు గ్రామపంచాయతీ లోని గ్రామ సర్పంచ్ లేళ్ళపల్లి లతా చంద్రశేఖర్ , కార్యదర్శి భాస్కర్ రావుఆధ్వర్యంలో  సోమవారం కరోనా పై అవగాహన ర్యాలీ లో ఎంపీడీవో టి రవి కుమార్ పాల్గొని. గ్రామంలోని పురవీధులలో ర్యాలీ నిర్వహించి గ్రామ సర్పంచ్ లతా చంద్రశేఖర్ మాట్లాడుతూగ్రామంలోని ప్రజలందరికీ 2000 మాస్కులు ప్రతి ఇంటికి అందే విధంగా చూడాలని వాలంటీర్స్ ని కోరారు, గ్రామంలోని  ప్రజలు ఎంత మంది ఉన్నారు ఇంకా ఎన్ని మాస్కులు అవసరం వస్తుందో లిస్టు తయారుచేసి ఇవ్వాలని మిగిలిన వారికి కూడా మాస్క్ అందేవిధంగా చూస్తామని గ్రామంలోని ప్రజలందరూ భౌతిక దూరంపాటించాలి, శానిటైజర్ వాడుతూ జాగ్రత్తలు పాటించాలని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించ కుంటే కరోనా మనపై ప్రభావం చూపుతుందని దాన్ని తరిమి కొట్టాలంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అలాగే ఉపాధి కూలీలు  108 మంది సభ్యులు 17 గ్రూపులుగా పని చేస్తూ ఉంటే వారికి జాగ్రత్తలు చెబుతూ ప్రతి ఒక్క ఉపాధి కూలీలకుమాస్కులు ఇవ్వటం జరిగింది.

 మాస్కులు ధరించేవిధానాన్ని కూడా వివరించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం నందు ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు వైయస్సార్ బీమా సర్వే వాలెంటర్ల్లు ద్వారా ప్రతి కుటుంబాన్ని సర్వే చేయాలని 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఉన్నవారికి సాధారణ మరణం అయితే 2 లక్షలు యాక్సిడెంట్ కి 5 లక్షలు వర్తిస్తుందని 50 సంవత్సరాల పైబడిన వారికి సాధారణ మరణం ఏమీ వర్తించదని యాక్సిడెంట్ గా పరంగా అయితే వర్తిస్తుందని అని ప్రతి ఒక్క వాలింటర్ 30వ తేదీ లోపు వైయస్సార్ బీమా సర్వే పూర్తి చేయాలని అని వివరించారు. 45 సంవత్సరాలు పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు మాని అందరు వ్యాక్సిన్ చేసుకునే విధంగా వాలెంటర్ల్ బాధ్యతలు చేపట్టాలని ఇది మన బాధ్యతగా తీసుకోవా లని అంగన్వాడి కార్యకర్తలు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, సచివాలయసిబ్బంది, కరోనా పట్ల ప్రజలకు  అవగాహన కల్పించాలి, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకుని ప్రజలు కరోనా వైరస్ పై చైతన్యం తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కడియాల సుబ్బారావు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పోల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...