ఆధునిక పద్ధతుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సన్నద్ధం కావాలి
చిత్తూరు పట్టణ, నగర ప్రాంతాల్లో ఆధునిక పద్ధతుల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు సన్నద్ధం కావాలని గ్రామ,వార్డు సచివాలయ విభాగం డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా పిలుపునిచ్చారు. గురువారం ఎ.ఎస్.సీ.ఐ (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఆన్ అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ శిక్షణ కార్యక్రమంలో భరత్ గప్తా ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ నుంచి వీడియో సమావేశం ద్వారా నగర కమిషనర్ పి.విశ్వనాథ్, ఎంహెచ్వో ఆనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు పారిశుధ్య పర్యావరణ కార్యదర్శులు, మేస్త్రీ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భరత్ గుప్తా మాట్లాడుతూ నగరపాలక పరిధిలో పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని.. ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ సైంటిఫిక్ విధానంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించడంపై అవగాహన పెంచుకోవాలన్నారు. వార్డు పర్యావరణ, పారిశుద్ధ్య కార్యదర్శులు ఈ ఆన్లైన్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీడీఎంఏ ఎం.ఎం.నాయక్, స్వచ్చాంద్ర కార్పొరేషన్ ఎండి సంపత్ కుమార్, ఎ.ఎస్.సీ.ఐ ప్రతినిధి ఉదయ్ సింగ్ లు పారిశుద్ధ్య నిర్వహణ అంశాలపై మాట్లాడారు.
No comments:
Post a Comment