అభివృద్ధిలో రాజీపడే ప్రసక్తే లేదు..
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు
లక్షెట్టిపెట్, పెన్ పవర్అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు స్పష్టం చేశారు.మండలంలోని గుళ్లకోట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ఆయన గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వరాష్టం ఏర్పాటు తర్వాత గ్రామం అద్దంలా అభివృద్ధి చేయడంమే లక్ష్యంగా పెట్టుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు.గతంలో ఏ ప్రభుత్వలు కూడా మన ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు ముందుకు రాలేదన్నారు.ఇప్పుడు ఏమారు మూల గ్రామం వెళ్లిన సీసీ రోడ్డులు, డ్రైనేజీలు 80శాతం పూర్తి అయ్యాయన్నారు.ఇక్కడ కూడా సుమారు 9లక్షల రూపాయల నిధులతో జాతీయ రహదారి నుండి గ్రామం లోపలి వరకు రోడ్డును నిర్మించడం జరిగిందన్నారు.ఇలాంటి మంచి కార్యక్రమలు చేస్తే గిట్టని పార్టీలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని వాళ్లకి ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోళ్ళ రవీందర్,డీసీఎంఎస్ చెర్మాన్ తిప్పని లింగయ్య,వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి,మున్సిపల్ వైస్ ఛైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్,పిఎసీఎస్ చెర్మాన్ ప్రబాకర్ రావు,పార్టీ మండల అధ్యక్షుడు చిన్నయ్య,ఉపాధ్యక్షుడు రమేష్ నాయకులు అసాది పురుషోత్తం,కిషన్,చతరాజు రాజన్న,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment