వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సింగిల్ విండో చేర్మెన్
గంభీరావుపేట, పెన్ పవర్
గంభీరావుపేట మండలం శుక్రవారం కొత్తపల్లి గ్రామం లో సింగిల్ విండో చేర్మెన్ భూపతి సురేందర్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు ముందు జాగ్రత్త కరోనా సెకండ్ వేవ్ విజృంబిస్తున్న తరుణంలో రైతులు ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ రైతులు మరియు హమాలీసోదరులు వాళ్ళు పలు జాగ్రత్తలు పాటించాలి మాస్క్ లు ధరించాలి. సామాజిక దూరం పాటించాలి శానిటైజర్ వాడాలి , తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, మండు టెండల్లో ఎండ కాలం లో కాళేశ్వరం జలాలను కొండా పోచమ్మ ప్రాజెక్టు ద్వారా కూడెల్లి వాగు ద్వారా ఎగువ మానేరు నింపినందుకు ప్రాంత రైతులపక్షాన పాదాభివందనం తెలిపారు. కరోనా నుండి త్వరగా కోలుకోవాలని అన్నారు. కనీస మద్దతూ ధర ఏ ) గ్రేడ్ 1888/- బి ) గ్రేడ్ 1868 /- రూ" ధాన్యం లో రాళ్లు , పొల్లు, తాళ్లు, ఇవి లేకుండా చూసుకోవాలి తేమ శాతం 17 % కంటే తక్కువ ఉండునట్లు చూసుకొవాలి రైతులకు తెలియజేయడమైనది గ్రామం లోని రైతులు ఇబ్బంది పడవద్దని గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు , ఐటీ శాఖమంత్రి తారక రామారావు,టెస్కాబ్ చేర్మెన్ కొండూరు రవీందర్ రావు, ప్రాంత రైతుల పక్షాన పాలకవర్గం పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎ. రాజనర సింహారెడ్డి, ఉపాధ్యాక్షులు గాండ్ల రాజాం సంఘం డైరెక్టర్లు జోగునర్సయ్య , వంగ దామోదర్ రెడ్డి, వంగా శ్రీనివాస్ రెడ్డి, పాతూరి బాల్ రెడ్డి, మ్యాకల యశోద, గౌరీ నేని భగవంత రావు, గౌరినేని నారాయణ రావు, సి ఈ ఓ రాజయ్య , సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment