Followers

కోవిడ్ రోగులు బయట తిరిగితే క్వారంటైన్ కు పంపించండి

 కోవిడ్ రోగులు బయట తిరిగితే క్వారంటైన్ కు పంపించండి - కలెక్టర్ విపి గౌతం


పెద్దగూడూరు, పెన్ పవర్ 

గిరిజన తండాలలో జిల్లా  కలెక్టర్ కలియ తిరిగారు. కోవిడ్ బాధితుల వద్దకు వెళ్ళి, పరామర్శించారు. పలు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మహబూబబాద్ జిల్లా కలెక్టర్ విపి  గౌతం గూడూరు మండలంలో  పర్యటించి అయోధ్య పురం లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ పిహెచ్సిలో స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నామని అదనపు సౌకర్యాలు అవసరమని కలెక్టర్ దృష్టికి తేగా పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో సర్పంచ్ కోరిన విధంగా రూ 1.50 లక్షలతో షెడ్డు నిర్మిస్తామన్నారు. అనంతరం తేజావత్ రామ్ సింగ్ తండాను కలెక్టర్ సందర్శించి ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న దశలో పండుగలు జరుపుకోవడం సరి కాదన్నారు. కరోనా వైరస్ సోకిన ఇద్దరు వ్యక్తులు విచ్చలవిడిగా తిరుగుతున్నారని కలెక్టర్ దృష్టికి తేగా వెంటనే 108 వాహనానికి పిలిపించి ప్రభుత్వ  క్వారంటైన్ కు తరలించాలని అన్నారు. సోమ్లా తండాను కలెక్టర్ సందర్శించారు కరోనా పాజిటివ్ వారితో మాట్లాడారు మరుగుదొడ్ల సౌకర్యం లేని వారిని ప్రభుత్వ క్వారంటైన్ కు తరలించాలని, అలాగే ఆరోగ్యం బాగా లేని వారిని కూడా గూడూర్ హాస్పిటల్ లో చేర్పించాలని అధికారులకు సూచించారు. గూడూర్ హాస్పిటల్ ను కలెక్టర్ సందర్శించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సామాజిక దూరం పాటించే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ పేషెంట్ల తో మాట్లాడారు కాన్పుల సంఖ్య పెంచాలని డాక్టర్ల  ను ఆదేశించారు.కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి చత్రు నాయక్, CDPO నీలోఫర్ అజ్మిీ  జిల్లా ఉప వైద్యాధికారి అంబరీష, జిల్లా కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాజేష్ తాసిల్దార్ శైలజ ఎంపీడీవో స్వరూప ,   డాక్టర్లు రాజు విక్రమ్ తేజావత్ రామ్ సింగ్ తండా సర్పంచ్ బోడ మంగీలాల్ ఎం పి టి సి బోడ కిషన్ పంచాయతీ సెక్రటరీ రోదే తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...