గ్రామాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పన జగన్ సాహసోపేత నిర్ణయమే...
వి.మాడుగుల, పెన్ పవర్
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్ల గ్రామాల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిగాయని అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు సత్యవతి అన్నారు. గురువారం మాడుగుల ఆర్ సి ఎం హైస్కూల్లో నియోజకవర్గ వాలంటీర్ల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాదయాత్రలో వైయస్ జగన్ ఇచ్చిన వాగ్దానాలు తూచా అమలు జరుగుతున్నాయన్నారు. గ్రామ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల ద్వారా గ్రామాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కలిగిందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తలుగా వాలంటీర్లు ఉన్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి చేరాలన్నది జగన్ లక్ష్యం అన్నారు. మేరకు 50 కుటుంబాలను వాలంటీర్లకు దత్తత ఇవ్వడం జరిగిందన్నారు. వారికి కేటాయించిన కుటుంబాలకు అవసరమైన పథకాలను అవసరాలను వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు నేరుగా ఆంధ్ర చేయాలన్నదే ప్రభుత్వ నిర్ణయం.
గ్రామ వాలంటీర్ సచివాలయం వ్యవస్థ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చి వారిని మరింత ఉత్సాహపరుస్తూ ఉందని ఆమె అన్నారు. రూరల్ జిల్లా లో 12,500 మంది గ్రామ వాలంటీర్లు 6500 మంది సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు. మాడుగుల నియోజకవర్గం పరిధిలో ఐదుగురు సేవా వజ్రాలను మండలానికి 5 సేవా రత్నాలుగా మిగిలిన వారిని సేవలు గా గుర్తించడం జరిగిందన్నారు. సేవా వజ్రాలకు 30 వేలు. సేవా రత్నాలకు 20 వేలు సేవలకు 10 వేలు నగదు ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాన్ని అందుకున్న వాలంటీర్లు ప్రజలకు మరింత సేవలు అందించి చేరువ కావాలని ఆమె హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలులో ముందడుగు లో ఉందని అన్నారు. ప్రతి పేదవానికి ప్రభుత్వ ఫలాలు దించాలనే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకు రావడం జరిగిందన్నారు. వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు సేవలు ప్రజలు అందుకుంటున్నారు. నియోజకవర్గంలో 1234 గ్రామ వాలంటీర్లు కాగా ఐదుగురు సేవ జరగా పదిమంది సేవ రత్న గా 1080 మంది సేవ కృషి గా ఎంపికయ్యారు అన్నారు. సేవా వజ్ర సేవ రత్న లకు నగదు ప్రోత్సాహకాలు అందజేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో నాగార్జునసాగర్ ఎంపీడీవోలు పోలినాయుడు జై ప్రకాష్ సచీదేవి సుబ్బలక్ష్మి నియోజకవర్గంలోని వాలంటీర్లు గ్రామ సచివాలయ ఉద్యోగులు వైసిపి నాయకులు అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment