కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలి.
జాజుల లింగంగౌడ్ డిమాండ్
తార్నాక, పెన్ పవర్తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేద,మధ్య తరగతి ప్రజలకు ఉచిత చికిత్స అందించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు. మధ్య తరగతి ప్రజలకు కరోనా సోకితే వారు ప్రైవేట్ దావాఖానాలకు వెళ్లే పరిస్థితి లేకుండా ఉందన్నారు. పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడవలసిన భాద్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చుతామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి మాట తప్పారని అన్నారు. కరోనా ద్వారా మరణించిన వ్యక్తి కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు.
No comments:
Post a Comment