విద్యార్థులు కు కెరీర్ గైడెన్స్ పుస్తకాలు పంపిణీ
పరవాడ, పెన్ పవర్
గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో 10 తరగతి మరియు ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తు ఎదుగుదలకు ఉపయోగపడే మార్గదర్శకాలను విద్యార్థుల భవిష్య దిక్సూచి అనే పుస్తకం ను అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు లుపిన్ హ్యూమన్ వెల్ఫేర్ & రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా పంపిణీ చేయడం జరిగింది.కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతీ విద్యార్థి కి వారియొక్క జీవిత లక్ష్యాన్ని నిర్ధేశించుకొని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ కెరీర్ గైడెన్స్ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది అని లుపిన్ ఫౌండేషన్ ప్రతినిధి ఎస్. అర్జున చెప్పారు.10 తరగతి మరియు ఆ పైన చదువుతున్న విద్యార్థులు కు విద్యావకాశాలు మరియు ఉద్యోగావకాశాల కోసం ఈ పుస్తకం ఒక మంచి దిక్సూచి లా ఉపయోగపడుతుందని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జి. వెంకట రావు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పరవాడ మండలం లో గవర్నమెంట్ హై స్కూల్, తానాం, జెడ్ పి హై స్కూల్స్,లంకెల పాలెం, లేమర్తి మరియు పరవాడ బాయ్స్ & గర్ల్స్ హై స్కూల్ లో 10 వ తరగతి చదువుతున్న సుమారు 450 మంది విద్యార్థుల కు కెరీర్ గైడెన్స్ పుస్తకాలు ను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో తానాం హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ బి. చిట్టిబాబు మాట్లాడుతూ 10 వ తరగతి విద్యార్థుల కు కెరీర్ గైడెన్స్ చాలా అవసరం అని ఉన్నత విద్య మరియు ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవడానికి ఈ విద్యార్థులు భవిష్య దిక్సూచి పుస్తకం చాలా ఉపయోగం అని అన్నారు.హై స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు లుపిన్ ఫౌండేషన్ వారి కృషి ని ప్రత్యేకంగా అభినందించారు.ట్రస్ట్ కార్యదర్శి ఎస్. అచ్చిబాబు మరియు హై స్కూల్ హెడ్ మాస్టర్ ఆర్. నాగేశ్వరరావు, బి. సురేఖ, పి. కుమారి మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment