పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబానికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక సాయం
తాళ్లపూడి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రావిపాటి గంగాధర స్వామి తండ్రి గోవిందరాజు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. కుటుంబ పెద్దని కోల్పోయి ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళ కుటుంబ పోషణార్ధం మరియు విద్యార్థికి చదువు నిమిత్తం ఆదివారం నాడు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ రూ.4000 ఆర్ధిక సాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు బారనాల శంకరరావు, సెక్రటరీ జోడాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు తుంపూడి నాగ భూషణ గుప్త, సభ్యులు డెంటిస్ట్ విజయ్ కుమార్, గెడ్డం సాయిబాబా, సనపల రాజశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు చోడిపిండి వీర వెంకట శ్రీనివాస్, సంకు లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment