Followers

తెలంగాణకు అండ గులాబీ జెండా

తెలంగాణకు అండ గులాబీ జెండా

మున్సిపల్  వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్..

లక్షెట్టిపెట్, పెన్ పవర్

తెలంగాణకు అండ గులాబీ జెండా అని మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్కూర్ చౌరస్తా వద్ద పార్టీ జెండా ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి ఇరవై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకొని ఇరవై ఒక్కటవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ ఎంతో అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరుకున్నాయని టిఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రజల అందరి దీవెనలతో కేసీఆర్ కేటీఆర్ కరోన మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, డీసీఎంఎస్ చెర్మాన్ తిప్పని లింగన్న, కౌన్సిలర్లు చతరాజు రాజన్న, ఒరగంటి శ్రీకాంత్, సురేష్, నాయకులు కట్ల చంద్రయ్య, నడిమెట్ల రాజన్న, రమేష్, గడ్డం వికాస్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...