రాజుపేట వాలంటీర్లకు సన్మాన సభ
వి.ఆర్.పురం మండలం రాజుపేట గ్రామ సచివాలయంలో గ్రామ వాలంటీర్లు గ్రామ సభ గ్రామ సర్పంచ్ శారద ఆధ్వర్యంలో ముగ్గురు వాలంటరీ లకు శాలువాలు కప్పి సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాజుపేట పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ శారద మాట్లాడుతూ రాజుపేట పంచాయతీకి ముగ్గురికి అవార్డు రావటం మనకు ఎంతో గర్వకారణం పంచాయతీ పరిధిలో ఉన్న వాలంటరీ లందరూ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ సేసి మీ సేవలు గ్రామపంచాయతీ ప్రజలకు అందించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గ భవాని సెక్రెటరీ ఉప సర్పంచ్ ముంజ పు రాము వైయస్సార్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment