సచివాలయ వాలంటీర్ అరుణ కుమారి కృషి అమోఘం
మహారాణి పేట, పెన్ పవర్
సచివాలయ సారధులు ఈ వాలంటీర్ లు సి.ఎం జగన్ మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న విశాఖపట్నం అర్బన్ జీవీఎంసీ జోన్ 4 గౌరి స్ట్రీట్ సచివాలయం కు చెందిన వాలంటీర్ అరుణ కుమారి కుటుంబంకు ఆసరాగా ఉండి వాలంటీర్ గా సర్వే లో ఉండగా అనుకోకుండా గాయం అయింది ఐనప్పటికిని తన విధి మర్చిపోకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువలో కష్టం వున్నా సరే పెన్షన్స్ అందించటం, ఇంటింటికి సర్వే, పథకాలు ప్రాముఖ్యత వివరించారు. మరియు కరోనా సమయంలో తన పాత్ర ను ప్రతీ ఇంటికి తగు ఆరోగ్య జాగ్రత్తలు, లక్షణాలు ఉన్న వారి వివరాలు హెల్త్ సిబ్బంది కి తెలియచేయటం లో కృషి , విశాఖపట్నం స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా స్వచ్ఛ విశాఖ కోసం పరిశుభ్రత కోసం అవగాహన పౌరుల కు కల్పించటం ఇంటింటికి రేషన్ అందించటం లో గౌరి స్ట్రీట్ సచివాలయం వాలంటీర్ కె. అరుణ కుమారి సేవలు అభినందననీయం అని స్థానికులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment