అణు ఇంధన సంస్థ సీఈ కలిసిన.. కార్పొరేటర్ ప్రభు దాస్
పెన్ పవర్, కాప్రాకాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హౌసింగ్ బోర్డు డివిజన్ లో ని కైలాసగిరి,రాజీవ్ నగర్,నవోదయ నగర్, భక్షిగూడ తదితర కాలనీలకు సీసీ కెమెరాలు అలాగే డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, సహాయ సహకారాలు అందించాలని అణు ఇంధన సంస్థ సీఈ దినేష్ శ్రీవాస్తవ ని మర్యాదపూర్వకంగా తన కార్యాలయం లో కలిసి కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అణు ఇంధన సంస్థ ఉద్యోగులు విజయరఘవన్, మురుగయ్య, నవీన్ కుమార్, వెల్ఫేర్ ఆఫీసర్ వినోద్ .మాజీ కార్పొరేటర్ టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు గుండారపు శ్రీనివాస్ రెడ్డి కలిశారు.
No comments:
Post a Comment