కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ...
బోథ్, పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు 34 కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న గొప్ప కానుక కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకమని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ మెంబర్ తాహెర్ బిన్ సలాం, ఆత్మ చైర్మన్ మల్లెపూల సుభాష్, సర్పంచ్ సురేందర్ యాదవ్, వెంకట రమణ గౌడ్ ,ఉమేష్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment