జుత్తాడ నేరస్థులకు తప్పక శిక్ష పడుతుంది...
విశాఖపట్నం, పెన్ పవర్
బాధిత కుటుంబానికి ప్రబుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని,నేరస్థులకు తప్పక శిక్ష పడుతుందని రాజ్యసభ సబ్యుడు,వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయి రెడ్డి అన్నారు.ఈ నెల15న పెందుర్తి మండంల జుత్తాడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటనలో బాదిత కుటుంబ సబ్యులను ఇసుకతోటలోని శివాజీపాలెంలో వారి నివాస గృహంలో శనివారం ఉదయం పరామర్శించారు.భాదితులతో మాట్లాడి వారికి ప్రబుత్వం,పార్టీ అన్నివిధాలా అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు.ఈ మేరకు వైకాపా జాతీయ అద్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మృతులు ఒక్కొక్కరికి 2 లక్షలు చెప్పున మెత్తం12 లక్షల రూపాయలు తక్షణ సహాయంగా పార్టీ తరుపున నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.పోలీసు ఉన్నతాదికారులతో మాట్లాడి విచారణ వేగవంతం చేయాలని,నిందితులకు త్వరితగతిన శిక్షపడేలా చర్యలు చేపట్టాలని కోరారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ జరిగిన సంఘటన అత్యంత అమానవీయ చర్యగా పేర్కోన్నారు.
నిందితుడు అప్పలరాజు ప్రస్థుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నాడని,అతనిని వెంటనే పోలీసు కస్టడీలోకి తీసుకొని విచారించే విధంగా చర్యలు చేపట్టాలని పోలీసు ఉన్నతాదికారులను సూచించినట్లు తెలిపారు.హత్యకు సహరించాడన్న ఆరోపణలు ఎదుర్కోంటున్న పోలీసు హోంగార్డు బత్తిన శ్రీనుని సస్పెండు చేసి విచారణ చేపట్టాలని కోరానని అన్నారు.భాదితుడు విజయ్ కి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని అతని కుమారుడికి మంచి స్కూల్ లో చేర్పించడం జరుతుందని అన్నారు.మరో బాదితురాలు లీలావతికి కూడా ఉద్యోగం కల్పించడం జరుగుతుందని అన్నారు.కేసు విచారిస్తున్న ఇన్వెష్టిగేషన్ అధికారికి కరోనా సోకడంతో అతని స్థానంలో త్రినాధ్ రావు అనే మరో పోలీసు అధికారిని నియమించి విచారణ వేగవంతం చేసేవిధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు.హత్య జరిగి వారం రోజులు గడుస్తున్నా నిందితుడు అప్పలరాజుని పోలీసు కష్టడిలోకి తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసారు.ఎ3, ఎ4 లను కూడా త్వరిత గతిన విచారించాలని సూచించినట్లు తెలిపారు.ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో నగర మేయర్ గొలగాలి వెంకట హరి కుమారి, వైకాపా నగర అధ్యక్షుడు వంశీక్రిష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment