బ్రాహ్మణ కొత్తపెల్లి గ్రామం ను సందర్శించిన డి పి వో
పల్లె ప్రకృతి వన నిర్మాణం పట్ల సంతృప్తి
నెల్లి కుదురు, పెన్ పవర్మహుబూబబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్త పల్లి లోని పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక, నర్సరీ, మరియు నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను జిల్లా పంచాయతీ అధికారి రఘవరుణ్ నెల్లికుదురు ఎం పి వో పార్థసారధి గౌడ్ తో కలిసి గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలలో పెరుగుతున్న ప్రతి మొక్కను అశ్రద్ధ చేయకుండా మొక్కలపై అవగాహన కలిగి పెంచాలన్నారు. మరియు గ్రామం లోని సెగ్రీగెషన్ షెడ్ చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో డి పి వో వెంట గ్రామ సర్పంచ్ చింతకుంట్ల యాకయ్య, ఉప సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్, వార్డ్ సభ్యులు బొల్లు మురళి, కారం ప్రశాంత్, పిడుగు మంజుల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment