ఒడిశా అధికారులు నాయకులపై కేసు నమోదు చేయండి..భీశెట్టి
విజయనగరం,పెన్ పవర్ఆంధ్ర, ఒడిశా రాష్ట్రల మధ్య దశాబ్దాలుగా వివాదం ఉన్న కొఠియా గ్రూపు గ్రామాల్లో ప్రాదేశిక ఎన్నికలు జరగనివ్వ బోమని వీరంగం సృష్టిస్తున్న ఒడిశా అధికారులు,నాయకులు పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసులు నమోదు చెయ్యాలని లోక్సత్తాపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి డిమాండ్ చేశారు,గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఒడిశా ప్రభుత్వం కి ప్రతిసారి ఇది అలవాటుగా మారిపోయిందని పంచాయతీ ఎన్నికల్లో ఇదే తీరున వ్యవహరిస్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందని, స్టేటస్కో కి వ్యతిరేకంగా ఒడిశా ప్రభుత్వం రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని భీశెట్టి మండిపడ్డారు ముక్యంగా గంజాయిభద్ర పట్టుచెన్నూరు,పగులు చెన్నూరు ప్రజలు ఓట్లు వెయ్యకుండా ముందురోజునే గ్రామ సరిహద్దుల్లో రాళ్లు పేర్చడం, సరిహద్దు ప్రాంతాల్లో కరోనా ఉందనే నెపంతో కర్ఫ్యూ విధించడం మంచిపద్దతి కాదని సాలూరు మండలం లోని గిరిజన ప్రాంతాల్లో 16 ఎంపీటీసీ సెగ్మెంట్లు, ఒక జెడ్పీ టీసీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయని ఒడిశా అధికారులు నాయకులు 21 వివాదస్పద గ్రామాల్లోని ఎన్నికలు జరగకుండా అల్లర్లు సృష్టించుతున్నారని సుప్రీంకోర్టు సూచనలను కూడా పట్టించుకోకుండా నడవడాన్ని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకోవాలని భీశెట్టి డిమాండ్ చేశారు,
పిఓ కూర్మనాధ్ సాహసం అద్భుతం!!
కీలక మైన ప్రాదేశిక ఎన్నికల్లో ఒడిశా ప్రభుత్వం వేసిన సరికొత్త ఎత్తుగడలు చిత్తు చేస్తూ కోఠియా పరిధిలోని కీలకమైన గ్రామాల్లోని గిరిజనులు ను పోలీసులు సహాయం తో చైతన్య పరుస్తూ గిరిజనులు ఓట్లు వేసేలా చర్యలు చేపట్టడం గొప్ప సాహాసమని లోక్సత్తాపార్టీ నుండి పోలీసులను ఐటిడిఏ ప్రోజెక్టు అధికారి కూర్మనాధ్ ని అభినందిస్తున్నామని అన్నారు,ఒడిశా రాష్ట్రం తో కోఠియా విష్యమై అమీ తుమి తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ని భీశెట్టి కోరారు.
No comments:
Post a Comment