రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ
పెన్ పవర్, మందమర్రికాసిపేట మండలంలోని ధర్మరావుపేట లో కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దం తిరుపతి . ఈ కార్యక్రమం నుద్దేశించి సిద్దం తిరుపతి మాట్లాడుతూ మండలంలో రోజురోజుకూ కరోన విజ్రుంబిస్తున్న తరుణంలో కొక్కిరాల ప్రేమ సాగర్ రావుకు తెలపగా వెంటనే ట్రాక్టర్ తో హైపోక్లోరైడ్ ద్రావణం పంపివ్వడం జరిగింది అని ఈ ద్రావణం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పిచికారీ చేపిస్తాం అని తెలిపారు, ప్రేమ సాగర్ రావు అధికారంలో లేకున్నా కూడా పేద ప్రజల మన గిరిజన గ్రామాల్లో కరోన వైరస్ ప్రబల కుండ ప్రజల ఆరోగ్యాలు కాపాడటమే కర్తవ్యంగా పనిచేస్తున్నారు అని అన్నారు. మండలంలోని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మరావుపేట యం పి టి సి పార్వతి మల్లేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజమౌళి, రాజు, శ్రీనివాస్ లు పాల్గొన్నారు
No comments:
Post a Comment