ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, సిబ్బంది ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం
మహారాణి పేట, పెన్ పవర్
అఖిల భారత మానవ హక్కుల పరిరక్షణ సమితి లో (ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి) ఆంధ్రరాష్ట్ర మహిళా విభాగం కార్యనిర్వాహక అధ్యక్షురాలు సిహెచ్ ఆదిలక్ష్మి, కన్న రావు దంపతులు మరియు బి.పావని శ్రీదేవి శంకర్ రావు దంపతులు పెళ్లి రోజు దినోత్సవ సందర్భంగా రైల్వే స్టేషన్ సమీపంలో నిరుపేదలకు అన్నదానం, శీతల పానీయాలు మరియు బిస్కెట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ జిల్లా సెక్రెటరీ బి.కేశవ.రావు, రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఇస్మాయిల్ మైనార్టీ విభాగం అధ్యక్షురాలు షేక్ మున్నీ, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు పిల్ల.సత్యవతి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వరరావు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.సుజాత డైరక్టర్ లలితా, ఆల్బీర్ట్,సత్య వేణి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment