Followers

దళితుల స్మశానవాటికలో సౌకర్యాలు కల్పించాలి

 దళితుల స్మశానవాటికలో సౌకర్యాలు కల్పించాలి

బొండపల్లి, పెన్ పవర్

బొండపల్లి మండలంలో గల గ్రామాల్లో దళితుల స్మశానవాటికలో సౌకర్యాలు కల్పించాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రదాన కార్యదర్శి గోకా రమేష్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం గజపతినగరం నియోజక వర్గం  పెంట శంకరరావుతో కలిసి బొండపల్లి హెచ్.డి.టి. శంకర్ రావు కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా గ్రామాల్లో దళితులకు శ్మశాన వాటికలు లేవని, ఉన్నా సౌకర్యాలు లేవని ఎదో ఒక చెరువు ప్రక్కన్న దళితులు శవాలను పాతి పెట్టుకుంటున్నారని, వర్షా కాలం వస్తే చెరువులు నిండి శవాలను పాతి పెట్టుకువడానికి సరైన వసతులు గాని లేక దళితులు తీవ్రమైన ఇబ్బందులుకు గురు అవుతున్నారని,  ఈ విషయాన్ని అధికారులు తక్షణమే స్పందించి ప్రతి గ్రామానికి సందర్శించి దళితులకు ప్రత్యేక స్మశాన వాటికలను కల్పించాలని,  శ్మశానలకు స్థలం మంజూరు చేయాలని, ఆ స్థలములో నీరు , షెడ్లు ఏర్పాటు చేయాలని లేదంటే ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉదృతం చేస్తామని రమేష్ బాబు, శంకర్ రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు రెడ్డి వెంకట రమణ, నాయిబాహ్మణ సంఘము జిల్లా ఉపాధ్యక్షుడు ఆలుమురి అప్పారావు, పెంట చిన్న, కాదులూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...