అందరికీ వ్యాక్సినేషన్ త్వరితగతిన పూర్తి చేయాలి
పెన్ పవర్ , రావులపాలెం
కరోనా తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్నందున 45 ఏళ్ళు దాటిన వారికి, రెండో డోసు వారికి, ఫ్రంటు లైను వారియర్సుకు త్వరితగతిన వాక్సినేషను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు సత్యానందరావు కోరారు. మే మొదటి వారం నుంచి 18 ఏళ్ళు పైబడిన వారందరికీ వాక్సిన్ వేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రికమండేషన్లు పక్కన పెట్టి నిబంధనలు మేరకు అందరికీ వాక్సిను సకాలంలో అందించాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా సెకండ్ వేవ్ కారణంగా కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు చూపు కొరవడిందని ధ్వజమెత్తారు. ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులులో ఆక్సిజన్, బెడ్లు, మందులు అందించడానికి యంత్రాంగాన్ని ప్రభుత్వం సిద్దం చేయలేక పోయిందని విమర్శించారు. వాక్సిన్ సరఫరాలో ప్రభుత్వం వైఫల్యం కారణంగా రోజుల తరబడి ప్రజలు క్యూ లైన్లులో నిలబడాల్సి వస్తోందన్నారు. కరోనా బారిన పడ్డ వారిలో మరణాలు సంఖ్య పెరిగి పోవడం ఆందోళన కలిగిస్తుందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించు కోవాలని సూచించారు. మాస్కు ధరించడంతో పాటు, పరిసరాలు శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
No comments:
Post a Comment