Followers

పట్టణవాసుల చెంతకు అరకు కాఫీ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ వంజంగి కాంతమ్మ

 పట్టణవాసుల చెంతకు అరకు కాఫీ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ వంజంగి కాంతమ్మ

అరకు, పెన్ పవర్

ప్రపంచ ప్రసిద్ధి చెందిన అరకు అరోమా కాఫీని రాష్ట్రము లోని పట్టణప్రాంత ప్రజలందరికి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మాజీ జెడ్.పి చైర్పర్సన్, సంస్థ చైర్మన్ వంజంగి కాంతమ్మ తెలిపారు.ఈ సందర్బంగా విజేఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం  సంస్థ బ్రోచర్ విడుదల ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నాణ్యమైన రుచికరమైన సహజసిద్ధమైన కాఫీ మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యి ఇతర ప్రాంతాలకు ఎగుమతివుతుందని, పట్టణ ప్రాంతాలవారు కూడా దీని వినియోగానికి ఆసక్తిని కనబరుస్తున్న నేపథ్యంలో కొంతమంది గిరిజనేతర గిరిజన యువతకు ఉపాధి కల్పిస్తూ ఈ అరకు అరోమా  కాఫీని పట్టణ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చామన్నారు.

 సంస్థప్రతినిధి ఎల్.శ్రీనివాస్ మాట్లాడుతూ పాడేరు పరిసర ప్రాంతాలలో అత్యధికంగా కాఫీ సాగులో ఉందన్నారు కాఫీ రైతుల అభివృద్ధి కోసం ఈ అరోమా ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. కాఫీ రైతు అప్పలమ్మ మాట్లాడుతూ తమ కాఫీ సాగు ప్రగతిని గుర్తిస్తూ జాతీయ స్థాయిలో పురస్కారాలను కేంద్రప్రభుత్వం అందజేసిందని పేర్కొన్నారు. కార్యక్రమం లో ఏపీ బిజినెస్ హెడ్ నాగేంద్ర,వంజంగి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...