నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ ను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం
మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య...
తొర్రూరు, పెన్ పవర్అన్నారం రోడ్డులో నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య అన్నారు. గురువారం ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ నందు కమిషనర్ గుండె బాబు,స్థానిక వార్డు కౌన్సిలర్ రోజాతో కలిసి, బోర్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... తొర్రూరు పట్టణ ప్రజల కోసం అన్నారం రోడ్డులో నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ పట్టణ వాసుల కోసం నిర్మించడం జరిగిందన్నారు. త్వరలోనే దీనిని అందుబాటులోకి తెస్తామని, అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు మాడుగుల నట్వర్, ఏన్నమనేని శ్రీనివాసరావు, కొలుపుల శంకర్, తెరాస నాయకులు దొంగరి శంకర్, బిజ్జల అనిల్, జె సింగ్ నాయక్, రవి జంప్పా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment