సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆవిర్భావ వేడుకలు
పెన్ పవర్, బయ్యారం
మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం లోని గౌరారం బాలాజీ పేట వెంకటరామపురం కొత్తపేట మొదలగు గ్రామాలలో సి పిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ 52వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గంధంపల్లి, కొత్తపేటలో జెండాలు ఎగరవేయడం జరిగింది. గంధం పల్లి లో కామ్రేడ్ చల్ల కృష్ణ అధ్యక్షత వహించగా పార్టీ మండల కమిటీ సభ్యులు వెంకట్ నర్సు జెండా ఎగరవేయడం జరిగింది. కొత్తపేటలో పార్టీ గ్రామ నాయకులు యాతం రమణారెడ్డి అధ్యక్షత వహించగా శాఖ కార్యదర్శి కామ్రేడ్ తోటకూరి రామకృష్ణ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ నాయకులు నిరంజన్. రాముడు. భూక్య కృష్ణ. పుల్లూరు వీరన్న. మాచర్ల సైదులు. యాతం భారతమ్మ .తదితరులు పాల్గొన్నారు. గౌరారం లో మాజీ సర్పంచ్ చింత వెంకన్న లెనోవా నగర్లో మేకలు ఉప్పలయ్య బాలమల్లు సదానందం వీరభద్రం ఆవిర్భావ వేడుకలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment