Followers

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు

విజయనగరం,పెన్ పవర్

ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు,ఔత్సాహికులు చొరవ చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.విపత్తు నివారణ సంస్థ వెల్లడించిన విధంగా ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతుందని కావున ప్రజలకు దాహార్తికి ఇబ్బంది లేకుండా రద్దీగా ఉన్న ప్రాంతాలలో నగరపాలక సంస్థ  చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఔత్సాహికులు, స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లయితే తమను సంప్రదించినచో అవసరమైన త్రాగు నీటిని ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా నిరాశ్రయులు ఎండవేడిమికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పట్టణ కేంద్రంలో ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెప్పారు. బిచ్చగాళ్ళు, నిరాశ్రయులు, నిరాధారమైన వృద్దులను పట్టణ నిరాశ్రయుల కేంద్రానికి అప్పజెప్పాలని కోరారు. ఎండ తీవ్రత దృష్ట్యా  ఎండలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల పనివేళల్లో మార్పు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 నుండి పనిచేసే కార్మికులకు మధ్యాహ్నం 3 నుండి  పనిచేసే విధంగా సమయాన్ని మార్పు చేశామని చెప్పారు. ప్రజలు కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్పా ఎండలో ఎక్కువగా తిరగవద్దని చెప్పారు ఒక వేళ ఎండలో వెళ్లాల్సి వస్తే తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా వడదెబ్బ నుండి రక్షించుకునే వారవుతారని తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...