గేటెడ్ కమ్యూనిటీ ల పేరుతో అక్రమంగా మూసివేసిన గేట్లను తక్షణమే తొలగించాలి.
గేటెడ్ కమ్యూనిటీ పేర్లతో మూనివేసిన అమూల్య హోమ్స్
పటించుకొని జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు
పెన్ పవర్, మల్కాజిగిరిఅనుమతులు లేకున్నా అక్రమంగా గేటెడ్ కమ్యూనిటీ పేర్లతో మూసివేసిన రోడ్లను తక్షణమే తెరవాలని చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షుడు ఎంపల్లిపద్మా రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గేటెడ్ కమ్యూనిటీ పేర్లతో మూసివేసిన అమూల్య హోమ్స్ లో ఎదుట చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ఆధ్వర్యంలో స్థానికులు ధర్నా నిర్వహించి బైఠాయించారు. గేటెడ్ కమ్యూనిటీ ల పేరుతో రోడ్లను కబ్జా చేసి గేట్లను నిర్మించుకొని వాటిని సొంత అవసరాలకు నియోగించుకుంటున్న వైనంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాప్రా సర్కిల్ పరిధిలో గేటెడ్ కమ్యూనిటీ లో పేర్లతో రోడ్ల ఆక్రమణలకు పాల్పడుతూ నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలు లు, వ్యక్తులపై సంబంధిత శాఖల అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇకనైనా జిహెచ్ఎంసి, కాప్రా సర్కిల్ఉన్నతాధికారులు స్పందించకపోతే ఈ ఆందోళనలు ఉద్యమ రూపం దాల్చుతాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమ్మిగడ్డ, న్యూ వాసవి శివ నగర్ పరిసర కాలనీ వాసులు గగన్ కుమార్, మారబోయినచంద్రశేఖర్, అంజయ్య, లక్ష్మమ్మ, వెంకటమ్మ, వసంత, గీత , శ్వేతా, కల్పన, దుర్గా రెడ్డి, పరుశురాం, వెంకట్రావు, వలి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment