కరోనా కష్ట కాలంలోనూ ఆగని సంక్షేమం
సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా సీఎం జగనన్న..
విద్యా దీవెన, సున్నా వడ్డీ లతో విద్యార్థులు, రైతులు, మహిళలకు అండ...
వరదయ్య పాలెం, పెన్ పవర్
సీఎం జగనన్న ప్రభుత్వం కరోనా కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాల తో ప్రజలను ఆదుకుంటుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. మొన్న విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, నిన్న రైతుల కోసం సున్నా వడ్డీ, నేడు మహిళలకు సున్నా వడ్డీ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వ అదుటుందన్నారు. ఒక వైపు రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయన్నారు. ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక సమస్య ఉంది. ప్రజలు సైతం తీవ్ర కష్టాల్లో ఇబ్బందులు పడుతున్నారు. తమ ఆర్థిక కష్టాలను భరిస్తూ, ప్రజలకు ఇబ్బంది రాకూడదని సంక్షేమ క్యాలెండర్ ప్రకారం పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం జగనన్న కే దక్కిందన్నారు. అలాగే ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రుల జాబితా ను జిల్లా కలెక్టరు విడుదల చేశారని, కరోనా సోకిన వారు వెంటనే ఆసుపత్రి లో చేరి నయం చేసుకోవాలన ఎమ్మెల్యే సూచించారు. ప్రజలు మాస్కులు, శానిటైజర్ లు వాడటంతో పాటు సామాజిక దూరం పాటిస్తూ కరోన వ్యాధి ని దరిచేరకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు
No comments:
Post a Comment