ఐక్య ఉద్యమాలతో మోడీ విధానాలను త్రిప్పి కొడదాం
మహారాణిపేట,పెన్ పవర్ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావుల రవీంద్రనాధ్ మోడీ నాయకత్వంలో వున్న కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఇక్క ఉద్యమాలతో త్రిప్పి కొడదామని, తద్వారా ప్రభుత్వరంగ సంస్థలను రక్షించుకుందామని ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావుల రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు.జివియంసి గాంధీ విగ్రహం వద్ద 7వ రోజు రిలే నిరాహారదీక్షలను ఆయన ప్రారంభించారు. ముఖ్య అతిధిగా రవీంద్రనాథ్ పాల్గొని మాట్లాడుతూ సరేంద్రమోడీ ప్రభుత్వం కార్మికులకు ఉన్న చట్టాలను 4 లేబర్ కోడ్ గా మార్చి యజమానులకు నేరుగా సహకరిస్తుందని ఎద్దేవా చేసారు. దేశంలో వుండే సంపదను అంబానీ, అధాని చేతుల్లో పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని, అందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు రక్షణరంగం, రైల్వే, బిఎస్ఎన్ఎల్, ఆయిల్ రంగ పరిశ్రమలు,ఇన్యూరెన్స్ బ్యాంకులు వంటి ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా కార్పోరేట్స్ కి కట్టబెడుతుంది. రైతులకు నష్టదాయకమైన నల్ల చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయరంగాన్ని నాశనం చేయడానికి పూనుకుందన్నారు. ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డల్లీలో రైతు పోరాడుతున్న దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు గత 60రోజుల నుండి పోరాటం చేస్తున్నా నిమ్మకు నీరెత్తునట్లుగా వ్యవహరిస్తుందన్నారు. కార్మికులు కర్షకులు మోడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఐక్య ఉద్యమాలు చేపడతామన్నారు. ఈ నెల 18న ఢిల్లీలో పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న రైతు నాయకులు విశాఖకు వచ్చి స్టీల్ ప్లాంట్ కార్మికులకు తమ మద్దతు ఇవ్వబోతున్నారని తెలిపారు.ఈ దీక్షా శిబిరంలో వేదిక ఛైర్మన్ ఎం.జగ్గునాయుడు అధ్యక్షత వహించారు.వేదిక కమిటీ సభ్యులు సీఐటీయూ అధ్యక్షులు కుమార్, వామనమూర్తి, రెహ్మన్, మన్మథరావు, సురేష్, ప్రియాంక, సిబటియు నగర కార్యదర్శి పి.మణి, ఎన్. సుబ్బారావు, వై.రాజు దీక్షలో కూర్చున్న వారికి పూలదండలు వేసి ప్రారంభించారు 7వ రోజు దీక్షలో ఆరిలోవ సిబటియు కార్యదర్శి వి. నరేంద్రకుమార్, బద్వా కార్యదర్శి ఎస్.రంగమ్మ నాయకత్వంలో సిఐటియు, ఏఐటీయూసీ ,బద్వా సభ్యులు నాగరాజు, భూలోకరావు, అప్పారావు, రాంబాబు,రమణ, బాబురావు శాంతి, శ్రీదేవి, గౌరిలతో పాటు ప్రజా నాట్యమండలి కళాకారులు కళారూపాలు ప్రదర్శించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment