Followers

చేతికందే ఎత్తుల్లో విద్యుత్ తీగలు,ప్రాణభయంతో రైతులు

 చేతికందే ఎత్తుల్లో విద్యుత్ తీగలు,ప్రాణభయంతో రైతులు
పిర్యాదు చేసిన పట్టించుకోని విద్యుత్ అధికారులు





చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల, పెన్ పవర్   


చేతికందే ఎత్తుల్లో విద్యుత్ తీగలు,ప్రాణభయంతో రైతులు, పిర్యాదు చేసిన పట్టించుకోని విద్యుత్ అధికారులు... ఐరాల మండలం , ఐరాల పంచాయతీ, ఐ. కే. రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతు ఓబుల్ నాయుడు తనకున్న పొలంలో వరి, టమేట పంటలు సాగుచేసుకుంటు జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనతో పాటు మరి కొందరు రైతులు ఓబుల్ నాయుడు పొలం పక్కన వ్యవసాయం చేస్తున్నారు...ఈ క్రమంలో విద్యుత్ అధికారులు ఓబుల్ నాయుడు పొలంలో 15 ఏండ్ల క్రితం 11 kv విద్యుత్ లైన్ తో పాటు lt లైన్ ను లాగారు...గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ లైన్ లు చేతికందే ఎత్తుకు రావడంతో రైతులు. పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందించి విద్యుత్ తీగల వల్ల రైతులకు ప్రాణహాని ఉంది కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు సరిచేయలని కోరిన విద్యుత్ అధికారులు స్పందించట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఓబుల్ నాయుడు పొలంలో టమేట చెట్లకు కొయ్యలు నాటే క్రమంలో గడ్డపార తో పనిచేస్తున్న రైతు కు విద్యుత్ తీగలు తగలడంతో రైతులు భయంతో పరుగులు తీశారు...గత సంవత్సర కాలంగా తాము అధికారుల చుట్టూ తిరుగున్న అధికారుల్లో చలనం లేకపోగా తమపై దాడి చేసేందుకు. ప్రయతించారని రైతులు వాపోతున్నారు...



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...