బాధితుల కుటుంబాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది
ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
చిన్నగూడూరు, పెన్ పవర్చిన్నగూడూరు.స్థానిక మండల కేంద్ర లోని పగిడిపల్లి గ్రామానికి చెందిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులైన భూపతి బాలమల్లు,గంధసిరి వెంకటమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ శుక్రవారం వారిని పరామర్శించడం జరిగింది.భాదిత కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.అదే విధంగా కొద్ది రోజుల క్రితమే ఇదే గ్రామానికి చెందిన దేశగాని యాదగిరి అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి, మనోధైర్యాన్ని ఎమ్మెల్యే కల్పించారు. ఈ పరామర్శలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మూల మురళీధర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు గంధసిరి వెంకన్న, మండల కో ఆప్షన్ సభ్యులు మీర్జా మోసిన్ బేగ్, సర్పంచ్ భానోతు శీరిషామంగీలాల్, గ్రామ పార్టీ అధ్యక్షుడు చేగోణి రవింధర్ జర్నలిస్టుల గంధసిరి శ్రీపాల్, భూపతి కాశయ్య గౌడ్, గంగన్న, వెంకటయ్య, వెంకట్ రెడ్డి, ఉప్పలయ్య, తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment