ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి...
బేల ఎస్ఐ సాయన్న
బేలా, పెన్ పవర్కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కూలు ధరించాలని ఎస్సై సాయన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కొగ్ధుర్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామంలో కరోనా మహమ్మారి పై ర్యాలీ నిర్వహించారు. గ్రామ యువతకు, గ్రామస్తులకు మాస్కుల వాడకం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతు కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ శానిటైజర్ సోషల్ డిస్టెన్స్ పాటించి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని తెలిపారు. మాస్కులు తప్పనిసరిగా వాడి, మాస్కులు ధరించడం పోతే చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి జరిమానా విధించబడుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment