Followers

కరోనా నివారణ కోసమే కోవై వ్యాక్సినేషన్ క్యాంపు

కరోనా నివారణ కోసమే కోవై వ్యాక్సినేషన్ క్యాంపు

కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్


రామగుండం ,  పెన్ పవర్

 ప్రస్తుతం రెండవ దశలో  కరోనా ప్రభావం తీవ్రతరం విభృంబిస్తూ వ్యాప్తి చెందుతున్న తరుణంలో రామగుండం 20వ డివిజన్ పరిధిలోని మల్యాలపల్లిలో స్థానిక కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ సమక్షంలో కోవై వ్యాక్సినేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ రెండవ దశలో కరోనా వైరస్ తీవ్రంగా ఉందని అయిన ప్రజలు ఎవరు కూడా కంగారు పడి భయాంధోళనకు గురి కావద్దని ఆయన ప్రజలకు భరోసా కల్పించారు. ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల సిబ్బంది స్థానిక ఎ.ఎన్.యంలు, అశా వర్కర్ లు కూడ తగినటువంటి సేవలందిస్తున్నారని కనుక వారిని సంప్రదించాలని ప్రజా ప్రతినిధులుగా తాము కూడ అందుబాటులో ఉంటామని అందుకే కరోన వైరస్ భారి నుండి ప్రజలను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్  అందరికి అందిస్తున్నాయని అందరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పక ధరించాలని అదే విధంగా ఈ కరోనా వ్యాక్సినేషన్ క్యాంపు తదుపరి రెండు మూడు రోజులు కూడ ఈ డివిజన్ లో వాక్సిన్ క్యాంప్  కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపర్ వైజర్ తిరుపతి రెడ్డి, ఏ.ఎన్.యం లక్ష్మి, అశా వర్కర్స్ తిరుమల, రాజేశ్వరి, ఆర్పి సరిత, అంగన్వాడి టీచర్ రేణుక మరియు ఎగ్గె.నరేష్, ఎస్.సతీష్, బి.రాజు, కె.మల్లేష్, టి.శంకర్, ఎ.గణేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...