Followers

కోవిడ్ రిపోర్ట్ లో అవకతవకలతో అంగన్ వాడి టీచర్ మృతి

కోవిడ్ రిపోర్ట్ లో అవకతవకలతో అంగన్ వాడి టీచర్ మృతి  

పెన్ పవర్, కురుపాం 

విజయనగరం జిల్లా కురుపాం లో స్థానికంగా నాలుగవా సెంటర్ కు అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న ఉమా(50) అనే మహిళ కోవిడ్ లక్షణాలు ఉండటం తో స్థానికంగా టెస్ట్ చేసుకున్నారు,అయితే ఆ రిపోర్ట్ నెగిటివ్ రావడం తో వైద్యం పొందకన్న ఉండటం తో వ్యాధి తీవ్రత ఎక్కువ అయిపోయి ఊపిరితిత్తులు కు ఇన్ఫెక్షన్ సోకింది. ఆమె కుమార్తె బొబ్బిలి లో నివాసం ఉండటం తో అక్కడకు వైద్యం నిమిత్తం వెళ్లిన ఆమె ఈ రోజు మృతి చెందారు, ఆమె కురుపాం ఐ.సీ.డీ.స్ పరిధిలో అంగన్వాడీ టీచర్ల యూనియన్ కు సెక్రటి గా కూడా పనిచేస్తున్నారు..ఆమె మృతి తో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. కోవిడ్ రిపోర్ట్స్ లో అవకతవకలు స్థానికంగా కోవిడ్ టెస్ట్ లు R.T.P.C.R కోసం నమూనా లు సేకరించి విజయనగరం పంపిస్తున్నారు, ఇక్కడ నుండి నమూనాలు విజయనగరం వెల్లకముందు కూడా కొంత మందికి నెగిటివ్ అని ఫోన్లు కు  ల సందేశాలు వస్తున్నాయి, టెస్ట్ లు సంఖ్య ఎక్కువగా ఉండటం తో రిపోర్ట్స్ సవ్యంగా రావట్లేదు అని ఆరోపణ ఉంది..అధికారులు మాత్రం అలాంటిది ఏమి లేదు అంత సవ్యంగా జరుగుతుంది అని చెప్తున్నారు..ఇప్పటికి అయిన రిపోర్ట్స్ లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని పలువులు కోరుతున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...