Followers

రాత్రి కర్ఫ్యూ వలన రాష్ట్రానికి ప్రయోజనం లేదు

 రాత్రి కర్ఫ్యూ వలన రాష్ట్రానికి ప్రయోజనం లేదు

రాష్ట్రంలో నఖిలిమందులను అరికట్టాలి!!

విజయనగరం, పెన్ పవర్

  కోవిడ్ నియంత్రణ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన రాత్రి కర్ఫ్యూ వలన ప్రజలకి,రాష్ట్రంకి ఎటువంటి ప్రయోజనం ఉండదని లోక్సత్తాపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు, శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటన వెలువడిన వెంటనే ప్రజల్లో, అధికారుల్లో, ప్రజా ప్రతినిధుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని అందరూ దీనివల్ల ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని భీశెట్టి అన్నారు,కరోనా కట్టడి చెయ్యవలసిన ప్రభుత్వం ఆ పని వదిలేసి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, అధికారులతోకలిసి సచివాలయం ఉద్యోగుల కి అవార్డు లు,జగనన్న విద్యాదీవెన పేరుతో  సదస్సులు నిర్వహించిందని, మరోవైపు సినిమాహాళ్లు, ఉత్సవాలు రాష్ట్రంలో యధావిధిగా నడిచాయని భీశెట్టి ఆరోపించారు, రాత్రి పూట కర్ఫ్యూ కంటే ఉదయం నుండి సాయంత్రం వరకూ జన సమూహాలు తిరగకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలని, రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రజలు తిరిగే జిల్లాల్లో లాక్డౌన్ పరిమిత సమయంలో ప్రకటించాలని  ఇదే సమయంలో గతంలో చేసినట్టు రైతుబజార్లను,మార్కెట్లను వికేంద్రీకరణ చెయ్యాలని రాష్ట్రంలో మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేయడం అవసరమని అన్నారు, ఇదే అదునుగా కరోనా బాధితులను దోచుకొనేందుకు మార్కెట్ లో నఖిలిమందులు విచ్చలవిడిగా ప్రవేశించాయనే ఆరోపణలు ఉన్నాయని,తరచూ సామాజిక మాధ్యమాల్లో అంతులేని పుకార్లు షికార్లు చేస్తున్నాయని వీటిపై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు,వీటివల్ల కరోనా బాధితులు ఆందోళన చెందుతున్నారని అన్నారు, వికలాంగులకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చెయ్యండి.  రాష్ట్రంలో 18నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారందరికీ మే నెలలో ఉచితంగా టీకా వెయ్యనున్న సందర్భంగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ని మండల కేంద్రాల్లో వికలాంగులకు(విభిన్న ప్రతిభావంతులు)ప్రత్యేక కౌంటర్ లు ఏర్పాటు చేసి టీకా వెయ్యాలని లోక్సత్తాపార్టీ నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కోరుతున్నామని రాష్ట్రంలో దాదాపు ఎనబైలక్షల మంది విభిన్న ప్రతిభావంతులైన వారు ఉన్నారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 18నుండి 45 వయస్సు ఉన్న దాదాపు 2కోట్ల నాలుగు లక్షల పై చిలుకు యువత కి ఉచితంగా టీకా వెయ్యాలని నిర్ణయించడాన్ని అభినందిస్తున్నామని భీశెట్టి బాబ్జి అన్నారు, రాష్ట్రంలో టెస్టులు వేగం పెంచి రిపోర్టులు వెంటనే ఇచ్చి ప్రజలని కరోనా బారినపడకుండా చూడాలని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...