స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఉత్తర నియోజకవర్గ శ్రేణులు
విశాఖ ఉత్తరం, పెన్ పవర్
జివిఎంసి డిప్యూటీ మేయర్,ఫ్లోర్ లీడర్,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ లు మరియు స్టాండింగ్ కమిటీ వైస్ చైర్మన్ తో పాటు మొత్తం 16 మంది కి వివిధ హోదాల్లో ఉత్తర నియోజకవర్గం వారికి అవకాశం కల్పించడంతో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు ఆధ్వర్యంలో శ్రేణులు మంగళవారం బీచ్ రోడ్డులో గల స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో విశాఖ నగర అభివృద్ధికి అనేక రకాలుగా కృషి చేశారని అదే స్ఫూర్తితో ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయుటకు కృషి చేస్తున్నారని తదనుగుణంగానే ఈ జీవీఎంసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి మేయర్ పీఠం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగిందని అన్నారు.
అంతేకాకుండా సోమవారం ప్రకటించిన జీవీఎంసీ కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ గా ఉత్తర నియోజకవర్గం లో 46 వ వార్డు కు చెందిన కటుమూరి సతీష్ కు, ఫ్లోర్ లీడర్ గా 44 వ వార్డు కు చెందిన బాణాల శ్రీనివాస్ కు మరియు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ లతో పాటు మొత్తం 16 మందికి వివిధ హోదాల్లో అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి,ఉత్తరాంధ్ర పరిశీలకులు రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ కార్పొరేటర్లు, వైకాపా నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment