మలేరియా రహిత సమాజమే మన ధ్యేయం
యాదమరి, పెన్ పవర్
మలేరియా రహిత సమాజమే మన ధ్యేయం అంటూ యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జ్యోతి ,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ లు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం యాదమరి మండలం సంత గేటు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు దోమ తెరలు వాడండి -దోకాటు నివారించండి. ప్రజా ఆరోగ్యానికి - దోమలు ప్రధాన శత్రువులు ,ప్రతి శుక్రవారం -ఫ్రైడే పాటించండి, నిల్వ ఉన్న నీరు -దోమలకు పుట్టినిల్లు, నీటి నిల్వలు దోమలకు- ఆవాసాలు వేపాకు పొగ- దోమలకు సెగ అని నినాదాలు చేస్తూ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. దోమలు కుట్టకుండా పుట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సభ్యునిట్ ఆఫీసర్ పీర్ సాబ్, హెల్త్ సూపర్వైజర్లు నిర్మలమ్మ, రెడ్డెమ్మ, యాదమరి పి ఎస్ సి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment