భవన నిర్మాణ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలి
ఆం.ప్ర. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం ఉదయం 11.30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆం.ప్ర.భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యన్. శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అవలంబించడం తగదన్నారు.భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల నుండి సుమారు 450 కోట్లు వేరే పథకాలు తరలించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన క్లైమ్ లను పరిష్కరించడంలో అటు ప్రభుత్వం, ఇటు లేబర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోన వైరస్ సందర్భంగా గతంలో ఇసుక కొరత వలన భవన నిర్మాణ కార్మికులకు పని లేక వారి కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లేబర్ కార్యాలయంలో నమోదు చేసుకున్న ప్రతి కార్మికునికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జరగనున్న అసెంబ్లీ సమావేశం సందర్భంగా చలో కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు, నగర కార్యదర్శి ఏ.సత్య మూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.గంగాధర్ గణపతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి గిడ్డు బాయ్, సరస్వతి భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి. మునస్వామి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment