ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల అందరికీ ఋణాలు మంజూరు చేయాలి
కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్సంపెల్లి సైదులు.
ఎంపీడీవో కు వినతి పత్రంసమర్పణ.
నెల్లికుదురు, పెన్ పవర్2019..నుండి2021సంవత్సరం వరకు ఎస్సి కార్పొరేషన్కు దరఖాస్తు చెసుకున్నవారికి రుణాలుమంజూర్ చేయాలని. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఇస్సంపెల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో మాట్లాడుతు. దరఖాస్తు చేసుకుని సంవత్సరాలు గడిచినా ప్రభుత్వం వారికి మంజూరు చేయడంలో పూర్తి విఫలమైందని సైదులు అన్నారు. రోజురోజుకు నిరుద్యోగులకు ఉపాధి దొరకక పోవడంతో ఉపాధి కోసం వలసలు వెళుతూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు తక్షణమే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అందరికీ ఉపాధి కల్పించుటకు రుణాలు మంజూరు చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంట్రాక్టు పనులపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల పట్ల లేదని ఎన్నికల ముందు అర్బాటమే తప్పా గేలిచినంక మరిచిపోతుంటారాని ఇది వారికి అలవాటుగా మారింది అని ఆయన అన్నారు. తక్షణమే ఋణాలు అందించాలని లెనియెడల అందోళన చేస్తామని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బండ వెంకన్న.ఇసం పల్లి వేణు అశోక్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment