మాస్కులు శానిటైజర్లు పంపిణీ
మేడ్చల్, పెన్ పవర్కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎంఆర్ గ్రూప్స్ కార్యదర్శి గోపాల్ రెడ్డి అన్నారు.గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీఎంఆర్ సెట్ కళాశాల ఆద్వర్యంలో గురువారం మేడ్చల్ మున్సిపాలిటీలోని పలు బస్తీల్లో ప్రజలకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీ విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి పంపిణీ చేసి కరోనా కట్టడిపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఎంఆర్ గ్రూప్స్ కార్యదర్శి గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ నారాయణ,కో ఆర్డినేటర్లు నాగరాజు దివ్య, మున్సిపల్ వైస్ చైర్మెన్ రమేష్, వెంకటేశ్వర్లు, నాయకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment