కౌంటింగ్ సూపర్వైజర్లు అసిస్టెంట్లు బాధ్యతాయుతంగా పని చేయాలి
పెద్దాపురం,పెన్ పవర్కౌంటింగ్ నిర్వహణలో కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు బాధ్యతయుతంగా పని చేయాలని ఆర్డీఓ ఎస్. మల్లి బాబు పేర్కొన్నారు. తెలిపారు.మంగళవారం పెద్దాపురం డివిజన్ పరిధిలో స్థానిక మట్ట ఆదినారాయణ కల్యాణ మండపంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సాధారణ ఎన్నికలు -2021 కౌంటింగ్ శిక్షణ కార్యక్రమం మాస్టర్ ట్రైనీలతో ఇవ్వడం జరిగింది.ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీఓ ఎస్. మల్లి బాబు మాట్లాడుతూ కౌంటింగ్ సమయంలో కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని,ఈ కౌంటింగ్ శిక్షణలో కౌంటింగ్ సూపర్ వైజర్లు,కౌంటింగ్ అసిస్టెంట్లు,పోలింగ్ ప్రక్రియలో వచ్చే సందేహలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు.అదేవిధంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని రెండు బ్యాచ్ లుగా వేరుచేయడం జరిగిందని, మొదటి బ్యాచ్ మ.2 గంటల నుంచి సా.4 గంటల వరకు, రెండవ బ్యాచ్ సా.4గం గంటల నుంచి 6 గంటల వరకు శిక్షణ నిర్వహించడం జరిగిందని తెలిపారు. బ్యాలెట్ బాక్సలు పనితీరు, బ్యాలెట్ పేపర్లు ,వ్యాలీడ్, ఇన్ వ్యాలీడ్ ఓట్ల పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.అదేవిధంగా పోలింగ్ ప్రక్రియలో ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని తెలిపారు.
పోలింగ్ సమయంలో శిక్షణ అధికారులు మాస్కులు, శానిటేషన్, సామాజిక దూరం పాటించే విధంగా ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు.పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ పాత్రలపై అవగాహనకలిగివుండాలని,రెగ్యులర్ బ్యాలెట్,పోస్టల్ బ్యాలెట్ లపై మధ్య వ్యత్యాసం ఆర్డీఓ క్షుణ్ణంగా తెలియజేసారు.అదేవిధంగా పోలింగ్ సమయంలో కౌంటింగ్ సూపర్ వైజర్లు,కౌంటింగ్ అసిస్టెంట్లు నిక్షిప్తపతంగా వ్యవరించాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ఇఓ పి.ఆర్.డి హిమా మహేశ్వరి, మాస్టర్ ట్రైనీలు బి. జాన్ కెనడి, వై. శ్రీనివాస్, వి. సీతారామరావు, ఎం. శివయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment